Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా ఛాంపియన్ట్రోఫీ హాకీ
ఢాకా: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో భారత్ డ్రాతో సంతృప్తిపడింది. మంగళవారం జరిగిన తొలి పోటీలో డిఫెండింగ్ ఛాంపియన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత్ 2-2తో కొరియాతో మ్యాచ్‌ను ముగించింది. మ్యాచ్ ప్రారంభమైన 4వ నిమిషంలోనే ఓ గోల్ కొట్టి భారత్.. 18వ నిమిషంలో మరో గోల్‌ను సాధించింది. తొలి గోల్‌ను వైస్ కెప్టెన్ లలిత్ ఉపాధ్యాయ చేయగా.. రెండో గోల్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ 18వ ని.లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో తొలి అర్ధభాగానికే భారత్ 2-0 ఆధిక్యతలో దూసుకెళ్లింది. భారతజట్టుకు చివర్లో 3 పెనాల్టీ కార్నర్లు లభించినా.. ప్రయోజనం లేకపోయింది. చివర్లో కొరియా జట్టు ఆటగాళ్లు సమిష్టిగా చెలరేగారు. 41, 46వ నిమిషాల్లో జంగ్ జియోన్, సంగ్యున్ కిమ్ ఒక్కో గోల్ కొట్టడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. ఇంతకుముందు టోర్నమెంట్లోనూ ముఖాముఖి ఇరుజట్లు తలపడగా.. ఆ మ్యాచ్ కూడా 1-1తో డ్రా అయ్యింది. భారతజట్టు బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది.