Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9-0 గోల్స్ తేడాతో భారత్ విజయం
ఢాకా: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన పోటీలో భారత్ 9-0 గోల్స్ తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. స్ట్రయికర్ దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. దిల్‌ప్రీత్ 12, 22, 45వ నిమిషాల్లో ఫీల్డ్ గోల్స్ కొట్టాడు. ఇక జర్మన్‌ప్రీత్ సింగ్ (33, 43వ ని.లో) రెండు గోల్స్ కొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది. లలిత్ ఉపాధ్యాయ(28వ ని.), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆకాశ్‌దీప్ సింగ్(54వ ని.), మన్దీప్ మోర్(55వ ని.)లో ఒక్కో గోల్ కొట్టడంతో భారత్ తిరుగులేని ఆధిక్యతతో విజయం సాధించింది. భారత జట్టు శుక్రవారం పాకిస్తాన్‌తో తలపడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ పోటీల్లో భారత్ తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే.