Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటా..
- మీడియాతో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి
ముంబయి: రోహిత్ శర్మతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, దక్షిణాఫ్రికా టూర్లో వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటానని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం తెలిపాడు. ముంబయిలో విరాట్ మీడియాతో మాట్లాడుతూ.. టెస్టు జట్టును ఎంపిక చేసుకోవడానికి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ కేవలం గంటన్నర ముందు మాత్రమే తనను సంప్రదించినట్లు తెలిపాడు. డిసెంబర్ 8న జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును ఎంపిక విషయమై విరాట్ కోహ్లి పలు విషయాలను తెలియజేశాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే అంశంపై సెలెక్టర్లు కానీ, బిసిసిఐ కానీ తనతో సంప్రదించలేదని, టి20 ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్ కెప్టెన్సీ వదులుకునే ముందు తానే బిసిసిఐకి చెప్పానన్నాడు. తన వ్యూహాలను వారికి వెల్లడించానన్నాడు. బిసిసిఐ దాన్ని స్వాగతించినట్లు తెలిపాడు. అయితే వన్డేలకు, టెస్టులకు కెప్టెన్గా కొనసాగేందుకు సిద్దంగా ఉన్నట్లు అప్పట్లో చెప్పినట్లు కోహ్లీ గుర్తు చేశాడు. ఒకవేళ ఆఫీసు బేరర్లు లేదా సెలెక్టర్లు తనకు కెప్టెన్సీ అప్పగించడానికి అనుకూలంగా లేకున్నా.. దానికి కూడా తాను సిద్ధమేనని తెలిపాడు. తానెప్పుడూ సెలెక్షన్ కమిటీకి, దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటానని, ఆ ఫార్మాట్ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడతానని స్పష్టం చేశాడు. వన్డేలకు కెప్టెన్గా కొనసాగరాదని అయిదుగురు సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలిపాడు. దక్షిణాఫ్రికా టూర్లో జరిగే వన్డేలకు తానేమీ రెస్ట్ కోరలేదని, తనపై అనవసరంగా తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పుకొచ్చాడు.