Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆఫీస్ బేరర్లను తప్పించి పాలకుల కమిటీ (సీఓఏ)ను నియమిస్తామన్న సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ వర్గం పేర్కొంది. ఈ మేరకు ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సురేందర్ అగర్వాల్, నరేశ్ శర్మ, అనురాధలతో కలిసి విజయానంద్ గురువారం ఉప్పల్ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ' సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నాం. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం. న్యాయమూర్తుల కమిటీ, సీఈఓలు హెచ్‌సీఏ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం' అని విజయానంద్ తెలిపారు.