Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 221/2
ఆడిలైడ్: డే నైట్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. ఓపెనర్ డెవిడ్ వార్నర్ (95, 167 బంతుల్లో 11 ఫోర్లు), మార్నస్ లబుషేన్ (95 నాటౌట్, 275 బంతుల్లో 7 ఫోర్లు) భారీ అర్థ సెంచరీలతో చెలరేగటంతో తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు 89 ఓవర్లలో 221/2 పరుగులు చేసింది. ఓపెనర్ మార్కస్ హారిశ్ (3) ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా.. డెవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ జోడీ ఆస్ట్రేలియాను పటిష్ట స్థితిలో నిలిపింది. రెండో వికెట్కు ఈ జోడీ 172 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. శతకానికి ఐదు పరుగుల దూరంలో వార్నర్ నిష్క్రమించగా.. వికెట్ కీపర్ జోశ్ బట్లర్ సులువైన క్యాచులను వదిలేయటంతో లబుషేన్ అజేయంగా ఆడుతున్నాడు. కెప్టెన్ స్టీవ్ (18 నాటౌట్, 71 బంతుల్లో 2 ఫోర్లు) ఫ్లడ్లైట్ల వెలుతురులో ఆకట్టుకున్నాడు. కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తితో సన్నిహితంగా ఉన్నందున కెప్టెన్ పాట్ కమిన్స్ ఆడిలైడ్ టెస్టుకు దూరమయ్యాడు. స్టీవ్ స్మిత్ సుదీర్ఘ విరామం అనంతరం కంగారూ జట్టు సారథ్యం వహించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.