Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూర్: స్కిల్, టెక్నిక్, ప్రతిభకు మానసిక దృడత్వం తోడైతేనే విజయం వరిస్తుంది!. అండర్-19 ఆసియా కప్‌కు సన్నద్ధతమవుతున్న భారత యువ క్రికెటర్లకు అదే విషయాన్ని అనుభవపూర్వక పాఠాలతో నూరిపోశాడు టీమ్ ఇండియా వైట్‌బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ. తొడ కండరం గాయంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ ప్రస్తుతం బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో గడుపుతున్నాడు. అక్కడే శిక్షణ శిబిరంలో ఉన్న అండర్-19 క్రికెటర్లకు రోహిత్ శర్మ వెలకట్టలేని క్రికెట్ పాఠాలు చెబుతున్న ఫోటోను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది.