Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్, విండీస్ వన్డేలు వాయిదా
లాహోర్: కరీబియన్ క్రికెట్ జట్టు శిబిరంలో కోవిడ్-19 కేసులు వెలుగు చూడటంతో పాకిస్థాన్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌ను వాయిదా వేశారు. మూడు వన్డేల సిరీస్‌ను వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. పాకిస్థాన్‌లో అడుగుమోపిన తొలి రోజే వెస్టిండీస్ జట్టులో కరోనా కలవరం మొదలైంది. కరాచీకి చేరుకోగానే ముగ్గురు క్రికెటర్లు, ఓ సహాయక సిబ్బంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. మూడో టీ20 (గురువారం)కి ముందురోజు మరో ఐదు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విండీస్ జట్టులో 14 మంది ఆటగాళ్లు మాత్రమే మిగిలారు. తుది జట్టును ఎంచుకునేందుకు సైతం అన్ని విభాగాల్లో సరైన కూర్పు లేకపోవటంతో మూడు వన్డేల సిరీస్‌ను వాయిదా వేయక తప్పలేదు. ఈ మేరకు పాకిస్థాన్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. పాక్ ఆటగాళ్లు అందరికీ కోవిడ్-19 నెగెటివ్ రావటంతో బయో బబుల్ నుంచి బయటపడ్డారు. టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.