Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబుషేన్ శతకం, స్మిత్ అర్థ సెంచరీ
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 473/9 డిక్లేర్డ్
ఆడిలైడ్: యాషెస్ డే నైట్ టెస్టులో ఇంగ్లాండ్ కష్టాల్లో కూరుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు భారీ స్కోరు కోల్పోయిన రూట్‌సేన.. బ్యాట్‌తోనూ తడబాటుకు గురవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 8.4 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 17/2తో ఒత్తిడిలో పడింది. కట్టుదిట్టంగా బంతులేసిన ఆస్ట్రేలియా కీలక వికెట్లు కూల్చింది. ఓపెనర్లు హమీద్ (6), రోరీ బర్న్స్ (4)లు విఫలమయ్యారు. డెవిడ్ మలాన్ (1 నాటౌట్), కెప్టెన్ రూట్ (5 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. మార్నస్ లబుషేన్ (103, 305 బంతుల్లో 8 ఫోర్లు) శతకం సాధించగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ (93, 201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) భారీ అర్థ సెంచరీ బాదాడు. ఈ ఇద్దరి మెరుపులకు తోడు లోయర్ ఆర్డర్లో అలెక్స్ కేరీ (51, 107 బంతుల్లో 5 ఫోర్లు), మిచెల్ స్టార్క్ (39 నాటౌట్, 39 బంతుల్లో 5 ఫోర్లు), మైకల్ నెసర్ (35, 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ట్రావిశ్ హెడ్ (18, 36 బంతుల్లో 3 ఫోర్లు) ధనాధన్ షోతో అదరగొట్టారు. 150.4 ఓవర్లలో 473/9 వద్ద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ డిక్లరేషన్ ప్రకటించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 17/2తో కష్టాల్లో నిలిచింది. 456 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.