Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీస్‌లో ఢ
- క్వార్టర్స్‌లో సింధు, ప్రణరు పరాజయం
వెల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అరుదైన ఘట్టం ఆవిష్కతం కాబోతుంది!. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో రెండు పతకాలే సాధించిన భారత్.. ఏకంగా ఓ సెమీఫైనల్లో ఆల్ ఇండియన్ సమరానికి రంగం సిద్ధం చేసుకుంది. పురుషుల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్, యువ సంచలనం లక్ష్యసేన్ ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లోకి చేరుకున్నారు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో టైటిల్ పోరులో బెర్త్ కోసం తాడోపేడో తేల్చుకోనున్నారు. కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ సెమీఫైనల్లోకి చేరుకోవటంతో భారత్ కనీసం రెండు పతకాలు ఖాయం చేసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌కు చేరుకుంటే కనీసం రజత పతకం లాంఛనమే.
శ్రీకాంత్ సులువుగా.. చెమటోడ్చిన లక్ష్య! : 12వ సీడ్ కిదాంబి శ్రీకాంత్ చెమట పట్టకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. నెదర్లాండ్ ఆటగాడు మార్క్ కాలోవ్పై 21-8, 21-7తో ఏకపక్ష విజయం నమోదు చేశాడు. 26 నిమిషాల్లోనే ముగిసిన క్వార్టర్స్‌లో శ్రీకాంత్ వన్‌మ్యాన్ షో చూపించాడు. టోర్నీలో ఆరంభం నుంచీ ఆత్మవిశ్వాసంతో కనిపించిన శ్రీకాంత్ సుదీర్ఘ విరామం అనంతరం టైటిల్ పోడియంపై నిలువనున్నాడు. ఓ ఏడాదిలో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్ మెడల్‌తో భారత అత్యుత్తమ మెన్స్ సింగిల్స్ క్రీడాకారుడిగా నిలువనున్నాడు!. మరోవైపు యువ ఆటగాడు లక్ష్యసేన్ ఉత్కంఠ మ్యాచ్‌లో గెలుపొంది సెమీస్‌కు చేరుకున్నాడు. మూడు గేముల హోరాహోరీ పోరులో లక్ష్యసేన్ పైచేయి సాధించాడు. చైనా ఆటగాడు జావో జున్ పెంగ్‌పై 21-15, 15-21, 22-20తో అదిరే విజయం నమోదు చేశాడు. 67 నిమిషాల ఉత్కంఠ మ్యాచ్‌లో లక్ష్యసేన్ కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చైనా షట్లర్ తొలుత దూకుడుగా ఆడాడు. 11-8తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచాడు. వరుస పాయింట్లతో 11-11తో స్కోరు సమం చేసిన లక్ష్యసేన్..13-13, 17-17, 18-18, 19-19, 20-20తో సమవుజ్జీగా కొనసాగాడు. చివర్లో వరుసగా రెండు పాయింట్లు సాధించిన లక్ష్యసేన్ ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పిన్న వయసులోనే ప్రతిష్టాత్మక టోర్నీలో పతకం సాధించిన షట్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. నేడు జరిగే సెమీఫైనల్లో సహచర సీనియర్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌తో లక్ష్యసేన్ పోటీపడనున్నాడు.
సింధు, ప్రణరు ఓటమి : డిఫెండింగ్ చాంపియన్ పి.వి సింధు పోరాటానికి క్వార్టర్స్‌లోనే తెరపడింది. వరల్డ్ నం.1 తైజుయింగ్ (చైనీస్ తైపీ) చేతిలో 17-21, 13-21తో సింధు వరుస గేముల్లోనే ఓటమి చెందింది. మెన్స్ సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్‌లో ఉద్విగ విజయం సాధించిన హెచ్.ఎస్ ప్రణరు క్వార్టర్స్‌లో ఆ వాడీ వేడీ చూపించలేకపోయాడు. సింగపూర్ ఆటగాడు కీన్ యెవ్తో పోరులో 14-21, 12-21తో వరుస గేముల్లోనే పరాజయం పాలయ్యాడు.