Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 236/10
- యాషెస్ సిరీస్ రెండో టెస్టు
ఆడిలైడ్ : డే నైట్ టెస్టుపై ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు బిగించింది. పేసర్ మిచెల్ స్టార్క్ (4/37), స్పిన్నర్ నాథన్ లైయాన్ (3/58), కామెరూన్ గ్రీన్ (2/24) వికెట్ల వేటలో విజృంభించటంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. డెవిడ్ మలాన్ (80, 157 బంతుల్లో 10 ఫోర్లు), జో రూట్ (62, 116 బంతుల్లో 7 ఫోర్లు) మూడో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అర్థ సెంచరీలు సాధించిన ఈ జోడీ నిష్క్రమణతో ఇంగ్లాండ్ పేకమేడలా కుప్పకూలింది. 86 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. బ్యాట్‌తో రెచ్చిపోతుంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డెవిడ్ వార్నర్ (13) రనౌట్‌గా నిష్క్రమించినా.. మార్కస్ హారిశ్ (21 నాటౌట్), మైకల్ నెసర్ (2 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు. మూడో రోజు ఆటలో 17 ఓవర్లలో ఆస్ట్రేలియా 45 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌తో కలిపి ఆస్ట్రేలియా ప్రస్తుతం 282 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నేడు ఉదయం సెషన్లోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి ఇంగ్లాండ్‌కు 400 ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది. ఆడిలైడ్ టెస్టులో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో కంగారూ జట్టు గెలుపు దిశగా దూసుళ్తోంది.