Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నో ప్రాంఛైజీ నియామకం
లక్నో : ఐపీఎల్ నూతన ప్రాంఛైజీ లక్నో దూకుడు పెంచింది. జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను చీఫ్ కోచ్‌గా నియమించిన ఆర్పీఎస్జీ గ్రూప్ తాజాగా ఐపీఎల్ టైటిల్ రెండుసార్లు నెగ్గిన సారథి గౌతం గంభీర్‌ను ప్రాంఛైజీలోకి తీసుకుంది. భారత మాజీ ఓపెనర్, లోక్‌సభ సభ్యుడు గౌతం గంభీర్ లక్నో ప్రాంఛైజీ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఆర్పీఎస్జీ గ్రూప్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ' ఈ అవకాశం అందించిన ఆర్పీఎస్జీ గ్రూప్‌కు ధన్యవాదాలు. గెలుపు కాంక్ష ఇంకా నాలో రగులుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ స్ఫూర్తి, ఆత్మ నిలిపేందుకు పని చేస్తాను' అని గంభీర్ అన్నాడు. 2008-2010లో ఢిల్లీ డెర్డెవిల్స్కు ఆడిన గంభీర్‌ను 2011లో కోల్‌కత నైట్‌రైడర్స్ తీసుకుని కెప్టెన్‌ను చేసింది. 2012, 2014 సీజన్లలో కోల్‌కతను గంభీర్ చాంపియన్‌గా నిలిపాడు. 2018 సీజన్లో తిరిగి ఢిల్లీ గూటికి చేరి సారథ్యం వహించినా.. వరుస పరాజయాలతో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగించి తప్పుకున్నాడు. 58 టెస్టుల్లో 4154, 147 వన్డేల్లో 5238, 37 టీ20ల్లో 932 పరుగులు చేసిన గౌతం గంభీర్ 2018 డిసెంబర్లో క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు. మెగా వేలానికి ముందు కొత్త ప్రాంఛైజీలు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. గంభీర్, ఫ్లవర్ జోడీ లక్నో ప్రాంఛైజీకి ఏ ముగ్గురిని ఎంచుకుంటారో చూడాలి.