Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌తో డే నైట్ టెస్టు పోరు
ఆడిలైడ్ : యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇంగ్లాండ్‌కు 468 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించిన కంగారూలు..రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేస్తున్నారు. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 82/4తో ఓటమి అంచుల్లో కొనసాగుతోంది. చివరి రోజు ఆటలో ఆస్ట్రేలియా విజయానికి మరో ఆరు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లాండ్ ఇంకా 386 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. ఓపెనర్ హసీబ్ హమీద్ (0), డెవిడ్ మలాన్ (20), జో రూట్ (24), రోరీ బర్న్స్ (34) అంచనాలను అందుకోలేదు. 43.2 ఓవర్లలోనే ఇంగ్లాండ్ కీలక మూడు వికెట్లు కోల్పోయింది. బెన్ స్టోక్స్ (3 నాటౌట్) అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. ఒలీ పోప్, జోశ్ బట్లర్, క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అంతకముందు మార్నస్ లబుషేన్ (51, 96 బంతుల్లో 6 ఫోర్లు), ట్రావిశ్ హెడ్ (51, 54 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీలతో చెలరేగటంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 230/9 వద్ద డిక్లరేషన్ ప్రకటించింది.