Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైస్ కెప్టెన్ బాధ్యతలు సైతం అప్పగింత
- స్టాండ్‌బై ఆటగాడిగా రిశిత్ రెడ్డికి చోటు
- అండర్-19 ప్రపంచకప్ భారత జట్టు ఎంపిక
ముంబయి : నాలుగు సార్లు చాంపియన్ టీమ్ ఇండియా మరోసారి జూనియర్ వరల్డ్‌కప్‌ను అందుకునే సైన్యాన్ని సిద్ధం చేసింది!. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్ వేదికగా అండర్-19 ప్రపంచకప్ జరుగనుంది. ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం ప్రకటించారు. ఆల్ ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీ ఈ మేరకు అండర్-19 జట్టును ఎంపిక చేసింది. అనూహ్యంగా ముక్కోణపు సిరీస్‌లో చోటు సాధించి అండర్-19 జట్టుకు ఎంపికైన హైదరాబాద్ యువ సంచలనం రిశిత్ రెడ్డికి నిరాశే ఎదురైంది. ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం అనిపించిన దశలో రిశిత్ రెడ్డి స్టాండ్‌బై ఆటగాడి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) యువ సంచలనం ఎస్కె రషీద్ ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యాడు. రషీద్‌పై సెలక్షన్ కమిటీ నాయకత్వ బాధ్యతలు సైతం నిలిపింది. ఢిల్లీ క్రికెటర్ యశ్ ధుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. 2000, 2008, 2012, 2018లలో భారత్ విజేతగా నిలిచింది. చివరగా న్యూజిలాండ్‌లో జరిగిన 2016 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ రన్నరప్‌గా నిలిచింది.
అండర్-19 ప్రపంచకప్ జట్టు : యశ్ ధుల్ (కెప్టెన్), హర్నూర్ సింగ్, రఘవంశీ, ఎస్కె రషీద్, నిశాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, అన్నీశ్వర్ గౌతమ్, దినేశ్ బనా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగడ్, మానవ్ పరాక్, కౌశల్ తంబె, హాంగార్కెర్, వాసు వాట్స్, విక్కీ, రవి కుమార్, సంగ్వాన్.
స్టాండ్‌బై క్రికెటర్లు : రిశిత్ రెడ్డి, ఉదరు సహరన్, అన్ష్ గోశారు, అమృత్ రాజ్ ఉపాధ్యారు, పిఎం సింగ్ రాథోర్.