Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతి వివక్ష ఆరోపణల దుమారం
జొహనెస్‌బర్గ్ : జాతి వివక్ష ఆరోపణలు దక్షిణాఫ్రికా క్రికెట్లో దుమారం రేపుతున్నాయి. ఎంతోమంది క్రికెటర్లు జాతి వివక్ష అనుభవాలను వెల్ల డిస్తుండటంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) విచారణకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, జాతీయ జట్టు చీఫ్ కోచ్ మార్క్ బౌచర్లపై వచ్చిన జాతి వివక్ష ఆరోపణలపై విచారణ జరుపనున్న అంబుడ్స్‌మన్ బోర్డుకు నివేదిక ఇవ్వనున్నాడు. గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్‌లు నల్ల జాతి క్రికెటర్లపై వివక్ష పూరితంగా వ్యవహరించటమే కాదు జాతి వివక్ష చూపుతూ వ్యాఖ్యలు చేసినట్టు పలువురు క్రికెటర్లు ఆరోపణలు చేశారు. మార్క్ బౌచర్ గతంలో తను చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తనకు ఇప్పటికే క్షమాపణలు తెలిపాడు. జాతి వివక్ష ఆరోపణలను గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్ తోసిపుచ్చారు. జాతి వివక్ష వ్యాఖ్యలపై స్వతంత్య్ర విచారణ కొనసాగుతున్నప్పటికీ భారత్‌తో టెస్టు సిరీస్‌లో మార్క్ బౌచర్ సఫారీ చీఫ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని సీఎస్ఏ తెలిపింది.