Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు మరో గౌరవం దక్కించుకుంది. బిడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా పి.వి సింధును నియమిస్తూ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 26 ఏండ్ల సింధు మరో ఐదుగురు అథ్లెట్లతో కలిసి 2025 వరకు అథ్లెట్స్ కమిషన్‌లో కొనసాగనుంది. 'ఆరుగురు సభ్యులను ఐరిస్ వాంగ్ (అమెరికా), రాబిన్ తబలాంగ్ (నెదర్లాండ్స్), పోలీ (ఇండోనేషియా), కిమ్ సోయోంగ్ (దక్షిణ కొరియా), పి.వి సింధు (భారత్), జెంగ్ సి వీ (చైనా)లుబిడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లోకి తీసుకుంటున్నట్టు సగర్వంగా ప్రకటిస్తున్నాం' అని బిడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.