Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 275 పరుగుల తేడాతో ఘన విజయం
- రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
ఆడిలైడ్ : యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు ఎదురులేదు!. వరుసగా రెండు టెస్టుల్లో కంగారూ జట్టు ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. డేనైట్ పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా హవా కొనసాగించింది. 275 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల యాషెస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 468 పరుగుల రికార్డు ఛేదనలో ఇంగ్లాండ్ చివరి రోజు పోరాట స్ఫూర్తి కనబరిచింది. ఓవర్‌నైట్ స్కోరు 82/4తో ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఉదయం సెషన్లోనే ఇంగ్లీష్ జట్టు కథ ముగుస్తుందనే అనుకున్నారు. జోశ్ బట్లర్ (26, 207 బంతుల్లో 2 ఫోర్లు) అసమాన పోరాట పటిమ ఇంగ్లాండ్‌ను చివరి సెషన్ వరకు పోరాడేలా చేసింది. బెన్ స్టోక్స్ (12), ఒలీ పోప్ (2) నిరాశపరిచారు. 56.4 ఓవర్లలో 105/6తో ఓటమి లాంఛనం చేసుకున్న ఇంగ్లాండ్.. బట్లర్ ఇన్నింగ్స్‌తో మరో 56.4 ఓవర్ల పాటు క్రీజులో నిలిచింది. క్రిస్ వోక్స్ (44, 97 బంతుల్లో 7 ఫోర్లు), ఒలీ రాబిన్సన్ (8, 39 బంతుల్లో 1 ఫోర్), స్టువర్ట్ బ్రాడ్ (9 నాటౌట్, 31 బంతుల్లో 1 ఫోర్) తోడుగా బట్లర్ ప్రతిఘటించాడు. మూడో సెషన్లో బట్లర్ వికెట్‌తో ఊపిరీ పీల్చుకున్న ఆస్ట్రేలియా.. మరికొద్దిసేపట్లోనే లాంఛనం ముగించింది. ఆడిలైడ్‌లో దారుణ ఓటమి ఎదురైనా.. జోశ్ బట్లర్ పోరాటం ఇంగ్లాండ్ శిబిరంలో స్ఫూర్తి నింపుతుందని చెప్పవచ్చు. తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా 473/9, 230/9తో భారీ స్కోర్లు నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకం, రెండో ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీతో రాణించిన మార్నస్ లబుషేన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. యాషెస్‌లో మూడో టెస్టు మెల్బోర్న్లో డిసెంబర్ 26న ఆరంభం కానుంది.