Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో జపాన్ చేతిలో 5-3తో ఓటమి
- నేడు కాంస్య పతకానికై పాకిస్తాన్‌తో ఢ
- ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ
ఢాకా: డిఫెండింగ్ ఛాంపియన్, టోక్యో ఒలింపిక్స్ హాకీ కాంస్య పతక విజేత భారత్.. ఢాకా వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో జపాన్ చేతిలో అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం జరిగిన సెమీస్ పోటీలో భారత్ 3-5గోల్స్ తేడాతో జపాన్ చేతిలో ఓడింది. మ్యాచ్ ప్రారంభమైన తొలి నిమిషంలోనే జపాన్ జట్టుకు పెనాల్టీ స్ట్రోక్ లభించడం, దాన్ని గోల్‌గా మలచడంలో జపాన్ 1-0 ఆధిక్యతను సంపాదించింది. మళ్లీ 2వ నిమిషంలోనే జపాన్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించడం, దాని రికీ ఫ్యూజీ గోల్‌గా మలచడంతో జపాన్ జట్టు తొలి 2 నిమిషాల్లోనే 2-0గోల్స్ ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత యషికీ(14వ ని), కొసారు కవాబే(35వ ని.) రైమో ఒక్కా(41వ ని)లో ఒక్కో గోల్ కొట్టారు. ఇక భారత్ తరఫున హార్దిక్ సింగ్(17, 58వ ని.) రెండు గోల్స్ కొట్టగా.. వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (43వ ని.) మరో గోల్ కొట్టాడు. మరో సెమీస్‌లో దక్షిణ కొరియా జట్టు 6-5గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. బుధవారం జరిగే కాంస్య పతక పోరులో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇప్పటివరకు భారతజట్టు 18సార్లు తలపడగా.. 16సార్లు భారత్ నెగ్గింది. కేవలం ఒకసారి మాత్రమే భారత్ పరాజయాన్ని చవిచూసి, మరో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. లీగ్‌లో భాగంగా భారత్ 6-0గోల్స్ తేడాతో జపాన్ను చిత్తుచేయగా.. సెమీస్‌లో జపాన్ పూర్తిగా భారత్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం విశేషం.