Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్ట్జే టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. గాయాల బారిన పడిన నోర్ట్జే పూర్తిగా కోలుకోని కారణంగా భారత్‌తో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమైనట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నోర్ట్జే దక్షిణాఫ్రికా తరఫున 12 టెస్టుల్లో 47 వికెట్లు తీసాడు. మూడుసార్లు ఐదుచొప్పున వికెట్లను పడగొట్టాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా 26నుంచి తొలిటెస్ట్ ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన నోర్ట్జే ఆ తర్వాత తీవ్ర గాయాలబారిన పడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో పేస్ భారం కగిసో రబడాపైనే పడనుంది. నోర్ట్జే 12 వన్డేలు, 16టి20ల్లోనూ దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించాడు.