Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11వ సారి జాతీయ బిలియర్డ్స్ టైటిల్ కైవసం
భోపాల్: మేటి ఆటగాడు పంకజ్ అద్వానీ మరోసారి జాతీయ బిలియర్డ్స్ టైటిల్ విజేతగా నిలిచాడు. రికార్డుస్థాయిలో 11వ సారి జాతీయ బిలియర్డ్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. బెస్ట్ ఆఫ్ నైన్ గేమ్స్‌లో పీఎస్‌పీబీ టీమ్మేట్ ద్రువ్ సిత్వాలాను 5-2 ఫ్రేమ్‌ల తేడాతో ఓడించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్లో 64, 42 వద్ద సిత్వాలా బ్రేక్స్ ఇచ్చాడు. అయితే దానికి బదులుగా అద్వానీ 56, 46 వద్ద బ్రేక్స్ తీసుకుని గేమ్‌ను 1-1తో టై చేశాడు. అయితే మూడవ గేమ్‌లో దూసుకువెళ్లిన సిత్వాలా 84 వద్ద బ్రేక్ తీసుకున్నాడు. ఇక నాల్గవ గేమ్‌లో సిత్వాలా చిన్న పొరపాటు వల్ల అద్వానీ పుంజుకున్నాడు. 127 వద్ద బ్రేక్ తీసుకుని గేమ్‌ను 2-2తో టై చేశాడు. ఇక ఐదో, ఆరో గేమ్స్‌లో 150 పాయింట్లు సాధించిన అద్వానీ మ్యాచ్‌లో తన ఆధిక్యతను 4-2కు పెంచుకున్నాడు. ఆ తర్వాత 148 పాయింట్ల బ్రేక్ తీసుకుని జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు.