Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ సెమీఫైనల్లోకి తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్లు ప్రవేశించాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో తమిళనాడు జట్టు 151 పరుగుల తేడాతో కర్నాటకను, హిమాచల్ ప్రదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌ను చిత్తుచేశాయి. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 354 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. జగదీశన్(102) సెంచరీకి తోడు కిషోర్(61), షారుక్‌ఖాన్(79; 39 బంతుల్లో 7ఫోర్లు, 6 సిక్సర్లు) కదం తొక్కారు. ప్రవీణ్ దూబేకు మూడు, ప్రసిధ్‌కు రెండు వికెట్లు దక్కాయి. భారీ లక్ష్య ఛేదనలో యుపి జట్టు 39 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ శ్రీనివాస్(43), మనోహర్(34) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. సీలంబరసన్కు నాలుగు, వాషింగ్టన్ సుందర్‌కు మూడు వికెట్లు దక్కాయి. మరో మ్యాచ్‌లో యూపీ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. యుపి జట్టు 45.3ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి విజయం సాధించింది. నేడు సౌరాష్ట్ర-విదర్భ, కేరళ-సర్వీసెస్ జట్ల మధ్య క్వార్టర్‌ఫైనల్ పోటీలు జరగనున్నాయి.