Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ విడుదల
న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన ్(బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో కిదాంబి శ్రీకాంత్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో రజిత పతకం సాధించి చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో నిలిచాడు. 28ఏండ్ల గుంటూరుకు చెందిన కిదాంబి స్పెయిన్ వేదికగా జరిగిన టోర్నమెంట్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. యువ షట్లర్ లక్ష్యసేన్ ఇదే టోర్నమెంట్లో సెమీస్‌కు చేరి కాంస్య పతకం సాధించడంతో అతని ర్యాంకింగ్ కూడా మెరుగైంది. అతడు ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంలో నిలిచాడు. బి సాయి ప్రణీత్ రెండు స్థానాలు దిగజారి 18వ స్థానంలో, క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన ప్రణరు రారు 26వ స్థానంలో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పివి సింధు 7వ స్థానంలో, సైనా నెహ్వాల్ 25వ ర్యాంక్‌లో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్ జోడీకి 10వ ర్యాంక్ దక్కగా.. మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ 20వ స్థానంలో ఉన్నారు.