Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్తాన్‌పై 4-3గోల్స్ తేడాతో గెలుపు
- ఆసియాకప్ హాకీ టోర్నీ
ఢాకా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈసారి కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ చేతిలో 5-3 అనూహ్యంగా ఓటమిపాలైన భారత్.. బుధవారం మూడో(కాంస్య పతకం)స్థానం కోసం జరిగిన పోటీలో పాకిస్తాన్‌ను 4-3 గోల్స్ తేడాతో చిత్తుచేసింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు పాక్‌పై విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. లీగ్‌లో భాగంగా భారతజట్టు 3-1 గోల్స్ తేడాతో చిత్తుచేయగా.. మ్యాచ్ ప్రారంభమైన తొలి నిమిషంలోనే వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఓ గోల్ కొట్టగా.. ఆ తర్వాత సుమిత్(45వ ని.), వరుణ్ కుమార్(53వ ని.), ఆకాశ్ దీప్ సింగ్(57వ ని.)లో ఒక్కో గోల్ కొట్టారు. ఇక పాకిస్తాన్ తరఫున అర్ఫజ్(10వ ని.), అబ్దుల్ రాణా(33వ ని.), అహ్మద్ నదీమ్(57వ ని.)లో ఒక్కో గోల్ కొట్టారు. టోర్నమెంట్లో భాగంగా భారతజట్టు పాకిస్తాన్‌తో తలపడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించడం విశేషం.
దక్షిణ కొరియాకు స్వర్ణం
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా దక్షిణ కొరియాజట్టు నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో కొరియా జట్టు పెనాల్టీ షూటౌట్లో 4-2 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తుచేసింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికే జపాన్ 2-1 గోల్స్ ఆధిక్యతలో నిలిచింది. కొరియా జట్టు 8వ నిమిషంలో తొలి గోల్ చేసి 1-0 ఆధిక్యతను సంపాదించినా.. ఆ తర్వాత జపాన్ 24, 29, 38వ ఒక్కో గోల్ కొట్టి 3-1 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. చివరి 5 నిమిషాల్లో (55, 60వ ని.)లో కొరియా జట్టు వరుసగా రెంండు గోల్స్ కొట్టడంతో నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరుజట్లు 3-3తో సమంగా నిలిచాయి. పెనాల్టీ షూటౌట్లో కొరియా జట్టు 4-2తో గెలిచింది. విజేతగా నిలిచిన కొరియాజట్టుకు స్వర్ణం, జపాన్కుకు రజిత పతకం దక్కాయి.