Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్ వేదికగా ఆటగాళ్ల వేలం
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా ఆటగాళ్ల వేలం త్వరలోనే అభిమానుల ముందుకు రానుంది. రెండు నూతన ప్రాంఛైజీల చేరికతో ఈ ఏడాది వేలం తొలి సీజన్‌ను తలపించనుంది. ఆటగాళ్ల వేలం సంప్రదాయ వేదిక బెంగళూర్‌లో ఫిబ్రవరి 12, 13న మెగా వేలానికి రంగం సిద్ధమైంది. బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆటగాళ్ల వేలం షెడ్యూల్‌పై బోర్డు తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎనిమిది పాత ప్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 30న సమర్పించగా.. డిసెంబర్ 25లోగా రెండు కొత్త ప్రాంఛైజీలు గరిష్టంగా ముగ్గురు ఆటగాళ్లను వేలానికి ముందు ఎంచుకునేందుకు అవకాశం కల్పించారు. ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో ప్రాంఛైజీ వేలం దిశగా అడుగులు వేస్తుండగా.. అహ్మదాబాద్ ప్రాంఛైజీపై కొంత అనిశ్చితి వాతావరణం నెలకొంది. సీవీసీ క్యాపిటల్ సంస్థ బ్రెజిల్, ఇటలీలో బెట్టింగ్ కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. ఈ విషయంలో బీసీసీఐ న్యాయ సలహా కోసం ఎదురుచూస్తుంది. దీంతో కొత్త ప్రాంఛైజీలు ఆటగాళ్లను ఎంచుకునేందుకు నిర్దేశించిన గడువును పొడగించే అవకాశం కనిపిస్తోంది. జనవరి మూడో వారం లోగా వేలంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేయనున్నారు.వేలంలో అన్ని ప్రాంఛైజీలకు రూ.90 కోట్ల పర్సు అందు బాటులో ఉంది.అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు కేటాయించిన మొత్తాన్ని మినహా యించి మిగతా పర్సు సొమ్ముతో వేలంలో ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది.