Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేస్ బౌలింగ్ కోచ్‌గా డెల్ స్టెయిన్
హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు సహాయక సిబ్బందిని ప్రకటించింది. మెగా వేలంతో ఐపీఎల్ 15ను సరికొత్తగా ఆరంభించేందుకు రంగం సిద్ధం చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ క్రికెట్ దిగ్గజాలను సహాయక బృందంలో చేర్చుకుంది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా దిగ్గజం డెల్ స్టెయిన్‌లను సహాయక సిబ్బందిగా ఎంచుకుంది. బ్రియాన్ లారా వ్యూహాత్మక సలహాదారు, బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగనుండగా.. డెల్ స్టెయిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేయనున్నాడు. సన్‌రైజర్స్‌తో సుదీర్ఘ కాలం పని చేసిన టామ్ మూడీ మరోసారి చీఫ్ కోచ్‌గా రానున్నాడు. గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ చీఫ్ కోచ్‌గా పని చేసిన సైమన్ కటిచ్ రానున్న సీజన్‌కు ఆరెంజ్ ఆర్మీ సహాయక కోచ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. హేమంగ్ బదాని ఫీల్డింగ్ కోచ్‌గా, ప్రతిభాన్వేషకుడిగా ఉండనున్నాడు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా కొనసాగిన వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్ బాధ్యతల్లోకి వెళ్లిపోవటంతో ఆరెంజ్ ఆర్మీ బ్రియాన్ లారాను ఎంచుకుంది.