Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్‌తో ఢీ
- విజయ్ హజారే వన్డే టోర్నమెంట్
జైపూర్: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ ఫైనల్లోకి హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు జట్లు ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ జట్టు 77 పరుగుల తేడాతో సర్వీసెస్‌ను, తమిళనాడు జట్టు 2 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను ఓడించాయి. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఆఖరి బంతికి విజయానికి అవసరమైన ఒక్క పరుగును సాధించి గెలిచింది. టాస్ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 8 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. జాక్సన్(134) సెంచరీకి తోడు అర్పీత్(52), వసవడ(57) అర్ధసెంచరీలతో రాణించారు. విజరు శంకర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం తమిళనాడు ఓపెనర్ అపరాజిత్(122)సెంచరీకి తోడు, ఇంద్రజిత్(50), వాషింగ్టన్ సుందర్(70) అర్ధసెంచరీలు కొట్టారు. చేతన్ సకారియాకు ఐదు వికెట్లు దక్కగా.. ఆఖరి బంతికి సాయి కిషోర్ సింగిల్ తీయడంతో తమిళనాడు గెలిచింది. మరో పోటీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర జట్టు 46.1 ఓవర్లలో 204 పరుగులకే కుప్పకూలింది. ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్‌కై హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు జట్లు పోటీపడనున్నాయి.