Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత మహిళా ఫెన్సర్ భవానీ దేవికి రూ.8.16 లక్షలు మంజూరుకు ప్రభుత్వం ఆమోదించింది. టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్లో భవానీ దేవి తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఈ ఏడాది నాలుగు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న భవానీ దేవి.. వచ్చే ఏడాదికి ఆమె ఖర్చులు, ప్రాక్టీస్ నిమిత్తం రూ.8.16 లక్షలు మంజూరు చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ మొత్తాన్ని ఆమె 2022 వార్షిక క్యాలెండర్ ఫర్ ట్రైనింగ్ అండ్ కాంపిటీషన్(ఏసీటీసీ) స్కీమ్ క్రింద మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. భారత్ తరఫున ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించిన ఏకైక మహిళా ఫెన్సర్ భవానీ దేవి మాత్రమే. జనవరి 4నుంచి జార్జియాలోని టెలిసిలో భవానీ దేవి శిక్షణ తీసుకోనుండగా.. అంతర్జాతీయ ఫెన్సింగ్ ఫెడరేషన్(ఎఫ్ఐఈ) ప్రపంచకప్ జనవరి 14-16న జార్జియాలోనే జరగనుంది. ఆ తర్వాత బల్గేరియాలో జనవరి 28-29న మరోదఫా ప్రపంచకప్ ఫెన్సింగ్ పోటీలు జరగనున్నాయి.