Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు శుక్రవారం గుడ్‌బై చెప్పాడు. భారత్ తరపున 103 టెస్టులు, 236 వన్డేలు ఆడిన 41ఏళ్ల హర్భజన్.. 1998లో ఆస్ట్రేలియా మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగ్రేటం చేశారు. 2015లో శ్రీలంకతో చివరి టెస్టు ఆడారు. టెస్టుల్లో 2శతకాలు, 9అర్ధ శతకాలు చేశాడు. 103 టెస్టుల్లో 417వికెట్లు, 236 వన్డేల్లో 269 వికెట్లు తీశాడు. అలాగే 28 టి20ల్లో 25 వికెట్లను పడగొట్టాడు. అలాగే టెస్టుల్లో 25సార్లు 5వికెట్లతోపాటు టీమిండియా సక్సెస్ఫుల్ బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒకడు. దాదాపు 23ఏళ్ల పాటు టీమిండియా తరఫున ఆడిన హర్భజన్ సింగ్.. ట్విట్టర్, యూట్యూబ్ వీడియో ద్వారా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. 'నేను ఎప్పుడైతే మైదానంలోకి అడుగు పెడతానో.. జెర్సీ వేసుకుంటానో.. ఆ సమయంలో నాకు ఆట తప్పించి ఇంకేం కనిపించదు. జెర్సీనే నాకు పెద్ద మోటివేషన్. కానీ కొన్నిసార్లు జీవితంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. గత కొన్నేళ్ల నుంచి ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా. కానీ.. ఆ రోజు రానే వచ్చింది' అంటూ హర్భజన్ సింగ్ యూట్యూబ్ వీడియోలో తెలిపాడు. ప్రస్తుతం హర్భజన్ సింగ్ ఐపీఎల్లో తప్పితే మరే క్రికెట్ ఫార్మాట్లో ఆడటం లేదు. 163 ఐపీఎల్ మ్యాచుల్లో 150 వికెట్లు తీశాడు. చాలా రోజుల నుంచి హర్భజన్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు.