Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ నేటినుంచేమ.1.30ని.ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
సెంచూరియన్: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారంనుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ స్టేడియం తొలి టెస్ట్‌కు ఆతిథ్యమివ్వనుంది. అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్ 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగడం ఖాయమైంది. కాన్పర్ వేదికగా జరిగిన టెస్ట్‌లో అరంగేట్రం టెస్ట్‌లోనే శ్రేయస్ రాణించడంతో అతని స్థానానికి ఢోకాలేదు. దీంతో మరోసారి హనుమ విహారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ గాయాలతో టెస్ట్ సిరీస్‌కు దూరం కావడంతో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలో దిగనున్నారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లకు బాక్సింగ్ డే టెస్ట్ కీలకంగా మారింది. వన్డే సిరీస్ పగ్గాలు రోహిత్ అందుకోవడంతో కోహ్లి టెస్ట్ కెప్టెన్‌గా మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. హెడ్ కోచ్‌గా ఎన్నికైన రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో టీమిండియా జట్టు తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. అలాగే ఇషాంత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లలో ఒకరు బెంచ్‌కే పరిమితమవ్వొచ్చు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణించగలడు కాబట్టి శార్దూల్ ఠాకూర్‌కూ చోటు దక్కకపోవచ్చు. ఇక టీమిండియా నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలో దిగే ఛాన్స్ అవకాశముంది.
ఇక దక్షిణాఫ్రికా జట్టు విషయానికొస్తే.. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే గాయంతో టెస్ట్ సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో పేసర్ సన్నే ఓలీవర్ తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. కగిసో రబడా, లుంగి ఎన్గిడి ఫామ్‌లో ఉండడంతో వీరు భారత బ్యాటింగ్ లైనప్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశముంది. బ్యాటింగ్ భారం మాత్రం కెప్టెన్ ఎల్గర్, వికెట్ కీపర్ బవుమా, క్వింటన్ డికాక్‌లపైనే ఉంది. సెంచూరియన్ పిచ్‌పై దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటివరకు 26 టెస్టులు ఆడగా.. అందులో 21 మ్యాచుల్లో గెలిచి కేవలం రెండింట్లో మాత్రమే ఆ జట్టు పరాజయాన్ని చవిచూసింది.