Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాషెస్ సిరీస్ బాక్సింగ్ డే టెస్టు
మెల్బోర్న్ : యాషెస్ సిరీస్ విజయానికి ఆస్ట్రేలియా మరింత చేరువైంది. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్‌ను ఓటమి కోరల్లోకి నెట్టేసిన ఆస్ట్రేలియా రెండో రోజే గెలుపు లాంఛనం చేసుకుంది!. జేమ్స్ అండర్సన్ (4/33), ఒలీ రాబిన్సన్ (2/64), మార్క్‌వుడ్ (2/71) రాణించటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకే కుప్పకూలింది. మార్కస్ హారిశ్ (76), డెవిడ్ వార్నర్ (38) రాణించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. నాథన్ లయాన్ (10), లబుషేన్ (1), స్టీవ్ స్మిత్ (16), ట్రావిశ్ హెడ్ (27), కామెరూన్ గ్రీన్ (17), అలెక్స్ కేరీ (19), పాట్ కమిన్స్ (21), మిచెల్ స్టార్క్ (24), స్కాట్ బొలాండ్ (6)లు అంచనాలకు అందుకోలేదు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలటంతో ఆసీస్ విలువైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో రోజు చివరి సెషన్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ అప్పుడే నాలుగు వికెట్లు కోల్పోయింది. హసీబ్ హమీద్ (7), జాక్ క్రావ్లీ (5), డెవిడ్ మలాన్ (0), జాక్ లీచ్ (0) తేలిపోయారు. మిచెల్ స్టార్క్, స్కాట్ బొలాండ్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 12 ఓవర్లలో 31 పరుగులుకు ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు చేజార్చుకుంది. బెన్ స్టోక్స్ (2 నాటౌట్), జో రూట్ (12 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు.