Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షంతో రెండో రోజు ఆట రద్దు
- భారత్, దక్షిణాఫ్రికా బాక్సింగ్ డే టెస్టు
నవతెలంగాణ-సెంచూరియన్
ఫ్రీడం టెస్టు సిరీస్‌లో వరుణుడు రంగ ప్రవేశం చేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయంపై కన్నేసి తొలి రోజు అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ ఇండియాను రెండో రోజు వరుణుడు నిలువరించాడు!. సోమవారం ఉదయం నుంచీ సెంచూరియన్ పార్క్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురవటంతో రెండో రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 272/3తో పటిష్ట స్థితిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓపెనర్, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ (122 నాటౌట్, 248 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్), మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానె (40 నాటౌట్, 81 బంతుల్లో 8 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నారు. రెండో రోజు 90 ఓవర్ల పూర్తి ఆట రద్దు కావటంతో నేడు (మూడో రోజు) ఆట దక్షిణాఫ్రికా కాలమానం ప్రకారం ఓ అర గంట ముందుగానే ఆరంభం కానుంది.
ఆగని చినుకు! : భారత్, దక్షిణాఫ్రికా బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఉదయం నుంచీ వర్షం జోరుగా కురిసింది. ఉదయం సెషన్లో వర్షం అంతరాయంతో ఆటను ఆలస్యం చేశారు. లంచ్ విరామ సమయాన్ని ముందుకు జరిపారు. లంచ్ సెషన్లో సైతం వర్షం తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. ఫీల్డ్ అంపైర్లు పలుమార్లు అవుట్ ఫీల్డ్ షెడ్యూల్స్ చేసినా ఫలితం లేకపోయింది. చివరి సెషన్లో సైతం వాతావరణ పరిస్థితులు మెరుగుపడే స్థితి లేకపోవటంతో టీ విరామానికి ముందే రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
రెండో రోజు నష్టపోయిన 90 ఓవర్ల కోటాను భర్తీ చేసేందుకు చివరి మూడు రోజుల్లో ఆటను ముందుగా ఆరంభించి, చివరి సెషన్‌ను సాధ్యమైనంత వరకు పొడిగించనున్నారు