Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు
కోల్‌కత : బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోవిడ్-19 బారిన పడ్డాడు. ఆదివారం స్వల్ప జ్వర లక్షణాలతో బాధపడిన గంగూలీకి కోవిడ్-19 నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం గంగూలీకి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో కోల్‌కతలోని గుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో బీసీసీఐ బాస్ చేరిపోయాడు. ఐదుగురు వైద్యుల బృందం పర్యవేక్షణలో సౌరవ్ గంగూలీ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు మంగళశారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో గుండెనొప్పితో ఇదే ఆసుపత్రిలో చేరిన గంగూలీకి రెండు స్టంట్లు వేసిన సంగతి తెలిసిందే. హృద్రోగ సమస్యల నేపథ్యంలో గంగూలీ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలటంతో కుటుంబ సభ్యుల్లో కాస్త ఆందోళన కనిపిస్తోంది.