Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకాడమీ కోసం తిరుపతిలో కేటాయింపు
స్టార్ షట్లర్‌కు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకం
విజయవాడ : భారత స్టార్ షట్లర్, మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించిన తెలుగు తేజం శ్రీకాంత్ ఈ ఘనత సాధించిన తొలి భారత మెన్స్ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసిన శ్రీకాంత్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ సిల్వర్ మెడల్‌ను సీఎంకు చూపించారు. శ్రీకాంత్‌కు రూ.7 లక్షల నగదు బహుమతి అందజేయటంతో పాటు తిరుపతిలో బ్యాడ్మింటన్ అకాడమీ నెలకొల్పేందుకు ఐదు ఎకరాల భూమి కేటాయించారు. మరో స్టార్ షట్లర్ పి.వి సింధుకు సైతం ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ఐదు ఎకరాల భూమి కేటాయించిన సంగతి తెలిసిందే. తిరుపతిలో ప్రపంచ శ్రేణి సదుపాయాలతో అత్యాధునిక అకాడమీ నెలకొల్పుతానని కిదాంబి శ్రీకాంత్ తెలిపాడు.