Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిడ్నీ ఏటీపీ టోర్నీకి జకోవిచ్ దూరం
సిడ్నీ : కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచ క్రీడలపై విరుచుకుపడుతోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పలు క్రీడల్లో టోర్నీలు, మ్యాచులు వాయిదా పడుతున్నాయి. కొత్త సంవత్సరం తొలి వారంలో జరుగనున్న సిడ్నీ ఏటీపీ టోర్నీకి వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా) దూరమయ్యాడు. సిడ్నీ ఏటీపీ టోర్నీ నుంచి తప్పుకునేందుకు గల కారణాలను జకోవిచ్ వెల్లడించలేదు. జనవరి 17 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆరంభం కావాల్సి ఉంది. కోవిడ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. స్టార్ ఆటగాడు డొమినిక్ థీమ్ ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. టాప్ సీడ్‌గా ఉన్న జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడటంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లతో మెన్స్ సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రేసులో పోటీపడుతున్న జకోవిచ్ రికార్డు టైటిల్ కోసం మెల్బోర్న్ వస్తాడనే అంచనాలు ఉన్నాయి. కానీ కోవిడ్-19 పరిస్థితులతో చివరి నిమిషం వరకు జకోవిచ్ ప్రాతినిథ్యంపై ఎటూ చెప్పలేని దుస్థితి నెలకొంది!.