Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా కప్ విజేత యువ భారత్
- 8వ సారి టైటిల్ కైవసం
దుబాయ్: ఆసియా అండర్-19 క్రికెట్ టోర్నీ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు విక్కీ(3/11), కౌశల్(2/23)కి తోడు రాజ్యవర్ధన్, రవి, రాజ్ తలో వికెట్‌తో చెలరేగడంతో లంక యువ జట్టు 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. శ్రీలంక జట్టు 57 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో రవీన్(15), యసిరు(19), మథేషా(14) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగల్గింది. అనంతరం డక్వర్ లూయిస్ పద్ధతిపై భారత్ 38 ఓవర్లలో 102 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ లక్ష్యాన్ని భారత్ 21.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి 104 విజయం సాధించింది. ఓపెనర్ రఘువంశీ(56నాటౌట్),రషీద్(31నాటౌట్) టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు. కాగా, ఈ టోర్నీ నిర్వహించిన 9 పర్యాయాల్లో టీమిండియా 8 సార్లు విజేతగా నిలవడం విశేషం. 2017లో యువ అఫ్గాన్ జట్టు.. పాక్‌ను ఓడించి అండర్-19 ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత టోర్నీలో భారత యువ జట్టు సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరగా.. లంకేయులు పాక్ యువ జట్టుకు షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించారు.