Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్
న్యూఢిల్లీ : రోహిత్ శర్మ గాయంతో దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ వన్డే సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ మేరకు ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. స్టార్ పేసర్, కీలక ఆటగాడు జశ్‌ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్ బాధ్యతలు అందుకున్నాడు. జశ్‌ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపిక కావటం పట్ల మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తపరిచాడు. ' భారత వైట్‌బాల్ జట్టుకు కెఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. కెఎల్ రాహుల్ నాయకత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ వైస్ కెప్టెన్‌గా బుమ్రా ఎంపిక నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. బౌలర్‌ను వైస్ కెప్టెన్ చేయటం భిన్నమైన విషయం. సహజంగా బౌలర్లు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తారు. ప్రతి బంతికి లేదా ప్రతి ఓవర్‌కు బౌండరీ లైన్ నుంచి వచ్చి నిర్ణయాలు పాలుపంచుకోవటం కష్టం' అని శరణ్‌దీప్ సింగ్ అన్నాడు. విరాట్ కోహ్లి, సెలక్షన్ కమిటీ మధ్య నడుస్తున్న వివాదానికి ముగింపు పలకాలని మీడియాకు సూచించాడు సింగ్. బీసీసీఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. భారత క్రికెట్ కోసం ఈ విషయాన్ని త్వరగా ముగించాల్సిన అవసరం ఉంది. చతేశ్వర్ పుజారా పేలవ ఫామ్ ఇలాగే కొనసాగితే త్వరలోనే అతడికి విశ్రాంతి ఇవ్వటం ఖాయమని శరణ్‌దీప్ సింగ్ అన్నారు.