Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రపంచ సాకర్ స్టార్, రికార్డు స్థాయిలో ఏడుసార్లు బల్లాన్ డీ అవార్డు గెల్చుకున్న అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. స్టార్ స్ట్రయికర్ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలినట్టు పారిస్ సెయింట్ జెయింట్ (పీఎస్జీ) ఫుట్‌బాల్ క్లబ్ వెల్లడించింది. సోమవారం ఫ్రెంచ్‌కప్‌లో పీఎస్జీ మ్యాచ్‌కు ముందు మెస్సీ మహమ్మారి బారిన పడ్డాడు. లియోనల్ మెస్సీతో పాటు పీఎస్జీ సహాయక సిబ్బందిలో ఒకరికి సైతం కోవిడ్-19 సోకినట్టు తెలిపింది. ఫ్రెంచ్కప్ గత సీజన్ రన్నరప్ మొనాకోలో సైతం ఏడుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 పాజిటివ్‌గా తేలినా లియోనల్ మెస్సీ ఆరోగ్యం నిలకడగా ఉందని, తీవ్రమైన లక్షణాలు ఏమీ లేవని పీఎస్జీ తెలిపింది.