Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్లో ఓవర్ రేటు ఫలితం
దుబాయ్ : సెంచూరియన్ కోటను బద్దలుకొట్టి దక్షిణాఫ్రికాపై అద్వితీయ విజయం సాధించిన భారత్.. స్లో ఓవర్ రేటు కారణంగా విలువైన పాయింట్లను కోల్పోయింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) నిబంధనల ప్రకారం ఎన్ని ఓవర్లు వెనుకంజలో నిలిస్తే అన్ని పాయింట్ల మేరకు కోత పడుతుంది. సెంచూరియన్ టెస్టులో పలు అవాంతరాల కారణంగా భారత్ ఓ ఓవర్ వెనుకంజలో నిలిచింది. ఐసీసీ నిబంధనల మేరకు భారత జట్టుకు ఓ పాయింట్ కోత విధించారు. దీనితో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. తొలి టెస్టు ఫీల్డ్ అంపైర్లు ఎరాస్మస్, అడ్రియన్, పాలేకర్, జెలెలు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ నిర్ణయాన్ని అంగీకరించటంతో ఈ విషయంలో తుదపరి విచారణ ఉండదు. భారత్ గతంలో ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులోనూ స్లో ఓవర్‌రేటు కారణంగా విలువైన రెండు పాయింట్లను కోల్పోయింది. మొత్తంగా భారత్ మూడు పాయింట్లు జరిమానా రూపంలో పోగొట్టుకుంది. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల్లో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనలిస్ట్‌లను సాధించిన పాయింట్ల శాతం ఆధారంగా నిర్ణయిస్తున్నారు. ఈ కొలమానం ప్రకారం ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్‌లు తొలి మూడు స్థానాల్లో కొనసాగుతుండగా భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. పాయింట్ల పరంగా 8 టెస్టుల్లో 53 పాయింట్లతో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది.