Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెవిన్ పీటర్సన్ విప్లవాత్మక సూచన
లండన్ : అంతర్జాతీయ క్రికెట్లో బయో బుడగలను పూర్తిగా ఎత్తివేయాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సంచలన సూచనలు చేశారు. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రికెట్‌ను ఏడాది కాలంగా బయో బబుల్స్‌లోనే నిర్వహిస్తున్నారు. బయో బబుల్స్‌లో గడపటంతో పాటు క్రికెటర్లు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావటమే కాకుండా మానసిక మనస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావం మైదానంలో ప్రదర్శనపై ప్రతికూలంగా పడుతోంది. ' క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి కఠిన బయో బబుల్స్‌ను వీలైనంత త్వరగా రద్దు చేయాలి. బయో బుడగలు క్రికెట్‌ను నాశనం చేస్తోంది. క్రికెటర్లు, సహాయక సిబ్బంది బయో బుడగతో అలసిపోయారు' అని కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు.
జకోవిచ్‌కు ఊరట! : సడలించిన కోవిడ్-19 నిబంధనలతో టెన్నిస్ స్టార్, వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ ఊపిరీ పీల్చుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనే అథ్లెట్లు తప్పనిసరిగా కోవిడ్-19 టీకా తీసుకోవాలనే నిబంధనను సడలించారు. దీంతో జకోవిచ్ జనవరి 17 నుంచి ఆరంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ నిలుపుకునేందుకు బరిలోకి దిగనున్నాడు. గత వారం ఈ నిబంధన కారణంగానే జకోవిచ్ ఏటీపీ సిడ్నీ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.