Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఇంగ్లాండ్‌తో నాల్గో టెస్టు
సిడ్నీ : కరోనా మహమ్మారి కలకలం రేగుతున్న తరుణంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు యాషెస్ సిరీస్‌లో నాల్గో టెస్టుకు సిద్ధమవుతున్నాయి. ఎదురులేని రీతిలో ఆస్ట్రేలియా 3-0తో ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ తీసికట్టు ప్రదర్శనతో యాషెస్ సిరీస్ ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం సైతం ముంచుకొస్తుంది. సిరీస్ ఓటమి, పేలవ ఫామ్, కెప్టెన్సీ ఒత్తిడి నేపథ్యంలో జో రూట్ నేడు సిడ్నీలో ఇంగ్లీష్ బృందాన్ని మెరుగైన పోటీనిచ్చేందుకు రెఢ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ తరఫున యాషెస్‌లో ఇప్పటి వరకు ఓ శతకం, ఓ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు కాలేదు. జో రూట్ బృందం దారుణ ప్రదర్శనతో స్వదేశంలో మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పరువు కోసం పొరాడాల్సిన గత్యంతరం ఏర్పడింది. సిరీస్ పోయినా, పోరాట స్ఫూర్తితో జట్టు మానసికంగా కుంగిపోకుండా చూడటమే జో రూట్ ముందున్న ప్రథమ కర్తవ్యం. మరో వైపు పాట్ కమిన్స్ సారథ్యంలో కంగారూలు కంగారు లేకుండా ఆడుతున్నారు. మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌తో చేతులు కలిపిన క్రికెట్ ఆస్ట్రేలియా యాషెస్‌లో సిడ్నీ టెస్టును పింక్ టెస్టుగా నిర్వహిస్తోంది. సిడ్నీలోనూ ఆతిథ్య ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.