Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ: ఆడిలైడ్ ఇంటర్నేషనల్-1 ఏటిపి-250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లోకి భారత డబుల్స్ జోడీ ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండోరౌండ్లో రామ్‌కుమార్-రోహన్ బొప్పన్న 6-7(4-7), 7-6(7-3), 10-4 సూపర్ టైబ్రేకర్‌లో అమెరికాకు చెందిన 8వ సీడ్ డియో-నాథనియేల్ను ఓడించారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ పోటీలోనూ భారత జోడీ 6-2, 6-1తో అమెరికా జోడీని చిత్తుచేసి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. ప్రి క్వార్టర్స్‌లో రామ్‌కుమార్-రోహన్ బొప్పన్న జోడీ ఫ్రాన్స్‌కు చెందిన మోనెగాస్, బెంజిమన్లతో తలపడనున్నారు. ఇక మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా-నడీలా(ఉక్రెయిన్) తొలిరౌండ్లో 6-1, 3-6, 8-10తో 2వ సీడ్ గాబ్రియేలా-ఓల్మోస్ చేతిలో ఓడారు.
ఏటిపి కప్ సెమీస్‌కు స్పెయిన్ :
ఏటిపి కప్ టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్లోకి స్పెయిన్ ప్రవేశించింది. బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో స్పెయిన్ 3-0 తేడాతో ఫేవరేట్ సెర్బియాను ఓడించింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో హబర్ట్ హుర్కురాజ్ 6-1, 6-4తో స్వాట్జ్మన్ను ఓడించాడు. రెండో సింగిల్స్‌లో కమిల్ మజ్రాక్ 6-3, 7-6(7-3)తో ఫెడరికో డెల్బోనిస్‌ను ఓడించాడు. మరో పోటీలో కర్రెన్నో బూస్టా(స్పెయిన్) 6-3, 6-4తో ఫిలిప్ క్రాజనోవిక్(సెర్బియా)ను ఓడించడంతో స్పెయిన్ జట్టు 3-0తో ఏటిపి కప్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. సెమీస్‌లో స్పెయిన్ జట్టు పోలెండ్‌తో తలపడనుంది. మరో క్వార్టర్స్‌లో పోలెండ్ జట్టు అర్జెంటీనాను ఓడించింది.