Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు పైకి ఎగబాకాడు. ఐసిసి విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో రాహుల్ 31వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంతోపాటు ఆ టెస్ట్‌లో 113 పరుగులు చేయడంతో కేఎల్ రాహుల్ ర్యాంకింగ్స్ మెరుగైంది. టీమిండియా మరో ఓపెనర్ మయాంక్ 60వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో బుమ్రా, మహ్మద్ షమీ తమ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. బుమ్రా 9వ స్థానంలో నిలవగా.. షమీ 8 స్థానాలు మెరుగుపరుచుకొని 17వ ర్యాంక్‌లో నిలిచాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ 14వ స్థానంలో ఉండగా.. బవుమా 17 స్థానాలు మెరుగుపరుచుకొని 39వ ర్యాంక్‌కు చేరాడు. సఫారీ పేసర్ రబడా 6వ స్థానంలో, ఎన్గిడి 16వ స్థానంలో నిలిచారు. సెంచూరియన్ టెస్ట్‌లో అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం పేసర్ జెన్సన్ బౌలర్ల జాబితాలో 97వ ర్యాంక్‌లో నిలిచాడు.