Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరుజట్లను ఊరిస్తున్న విజయం
- భారత్ రెండో ఇన్నింగ్స్ 266ఆలౌట్
- పుజరా, రహానే అర్ధసెంచరీలు
- దక్షిణాఫ్రికా లక్ష్యం - 240, ప్రస్తుతం - 118/2
జొహన్నెస్‌బర్గ్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఓవర్ నైట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన భారతజట్టును అజింక్య రహానె(58), ఛటేశ్వర పుజారా(53) అర్ధశతకాలతో రాణించారు. హనుమ విహారి(40నాటౌట్)కి తోడు శార్దూల్ ఠాకూర్(28) రాణించినా.. మిగతా బ్యాటర్స్ నిరాశపరిచారు. రిషభ్ పంత్(0), అశ్విన్(16), షమీ(0), బుమ్రా(7) ఇలా వచ్చి.. అలా వెళ్లారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, రబడా, ఎన్గిడికి మూడేసి, ఓలీవర్కు ఒక వికెట్ లభించాయి. 240 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ జట్టు ఓపెనర్లు మార్క్రమ్, ఎల్గర్ కలిసి తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మార్క్రమ్(31) ఔటైనా.. పీటర్సన్(28) కూడా కొంతసేపు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. మూడో రోజు ఆట నిలిచే సమయానికి ఎల్గర్(46), డుస్సేన్(11) క్రీజ్‌లో ఉండగా.. అశ్విన్, శార్దూల్‌కు తలా ఒక వికెట్ లభించాయి. ఈ క్రమంలో ఇరుజట్లను విజయం ఊరిస్తోంది. గురువారం భారత్ మరో 8 వికెట్లు చేజిక్కించుకొంటే చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ గెలవనుండగా.. దక్షిణాఫ్రికా జట్టు మరో 122 పరుగులు చేసి మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలువనుంది.
దక్షిణాఫ్రికా ఆటగాళ్ల స్లెడ్జింగ్ :
ఇవాళ తొలి సెషన్ నుంచే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేయడం ప్రారంభించారు. తొలుత రహానె, పుజారాను కాసేపు కవ్వించినా.. వారి ముందు మంత్రం పనిచేయలేదు. అయితే ఇద్దరు మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో స్లెడ్జింగ్ డోసును ప్రొటీస్ ఆటగాళ్లు పెంచారు. రిషభ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసిన డస్సెన్ స్లెడ్జింగ్‌కు దిగాడు. అలానే బుమ్రా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బౌలర్ జాన్సెన్ స్లెడ్జింగ్‌లో కాస్త శ్రుతిమించాడు. బుమ్రా కూడా ఏమాత్రం తగ్గకుండా సమాధానం ఇవ్వడంతో వాతావరణం హాట్‌గా మారింది. అయితే అంపైర్ సహా ఇతర ఆటగాళ్లు సముదాయించడంతో అక్కడితో సద్దుమణిగింది.
స్కోర్‌బోర్డు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 202
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 229
భారత్ రెండో ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి)మార్క్రమ్ (బి)జెన్సన్ 8, అగర్వాల్ (ఎల్బి) ఓలీవర్ 23, పుజరా (ఎల్బి) రబడా 53, రహానే (సి)వెర్రెయనే (బి)రబడా 58, విహారి (నాటౌట్) 40, పంత్ (సి)వెర్రెయనే (బి)రబడా 0, అశ్విన్ (సి)వెర్రెయనే (బి)ఎన్గిడి 16, శార్దూల్ (సి)మహరాజ్ (బి)జెన్సన్ 28, షమీ (సి)వెర్రెయనే (బి)జెన్సన్ 0, బుమ్రా (సి)జెన్సన్ (బి)ఎన్గిడి 7, సిరాజ్ (బి)ఎన్గిడి 0, అదనం 33. (60.1 ఓవర్లలో ఆలౌట్) 266పరుగులు.
వికెట్ల పతనం: 1/24, 2/44, 3/155, 4/163, 5/167, 6/184, 7/225, 8/228, 9/245, 10/266
బౌలింగ్: రబడా 20-3-77-3, ఓలీవర్ 12-1-51-1, ఎన్గిడి 10.1-2-43-3, జెన్సన్ 17-4-67-3, మహరాజ్ 1-0-8-0
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (ఎల్బి) శార్దూల్ 31, ఎల్గర్ (బ్యాటింగ్) 46, పీటర్సన్ (ఎల్బి) అశ్విన్ 28, డుస్సేన్ (బ్యాటింగ్) 11, అదనం 2, (40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 118 పరుగులు.
వికెట్ల పతనం: 1/47, 2/93
బౌలింగ్: బుమ్రా 10-1-42-0, షమీ 9-2-22-0, శార్దూల్ 9-1-24-1, సిరాజ్ 4-0-14-0, అశ్విన్ 8-1-14-1