Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022 మహిళల వరల్డ్‌కప్‌కు భారత జట్టు
ముంబయి : మహిళల క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్ కెప్టెన్సీలోనే భారత్ ఐసీసీ 2022 మహిళల ప్రపంచకప్ వేటకు సిద్ధమవుతోంది. మార్చి-ఏప్రిల్‌లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ న్యూజిలాండ్ వేదికగా జరుగనుంది. వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టును ఆల్ ఇండియా సీనియర్ మహిళల సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. వరల్డ్‌కప్ సహా కివీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో ఆడే జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఏకైక టీ20కి సైతం జట్టును ప్రకటించారు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్ ద్వైపాక్షిక సిరీస్ అనంతరం వరల్డ్‌కప్‌లో పోటీపడనుంది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన వరల్డ్‌కప్ జట్టులో స్టాండ్‌బైగా ఎంపికైంది.
ప్రపంచకప్, వన్డే జట్టు : మిథాలీరాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, యస్టికా భాటియ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేV్‌ా రానా, జులన్ గోస్వామి, పూజ వస్ట్రాకర్, మేఘ్న సింగ్, రేణుక సింగ్ ఠాకూర్, తానియ భాటియ (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్. (స్టాండ్‌బై : సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రాన్ బిల బహదూర్)
టీ20 జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యస్టికా భాటియ, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేV్‌ా రానా, పూజ, మేఘ్న సింగ్, రేణుక, తానియ (వికెట్ కీపర్), రాజేశ్వరి, పూనమ్, ఏక్తా బిస్త్, మేఘన, సిమ్రన్.