Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్
దుబాయ్ : భారత జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌పై, విదేశీ గడ్డపై దక్షిణాఫ్రికాపై అద్బుత ప్రదర్శన చేసిన మయాంక్ అగర్వాల్ ఐసీసీ డిసెంబర్ నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. డిసెంబర్లో మయాంక్ అగర్వాల్ 69 సగటుతో 276 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు, ఓ శతకం ఉన్నాయి. న్యూజిలాండ్‌పై ముంబయి టెస్టు విజయంలో మయాంక్ అగర్వాల్‌ది ముఖ్య పాత్ర. వరుసగా 150, 62 పరుగుల మెగా ఇన్నింగ్స్‌లతో మయాంక్ విమర్శకులను మెప్పించాడు. దక్షిణాఫ్రికాపై సెంచూరియన్ టెస్టులోనూ మయాంక్ అదరగొట్టాడు. కెఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి చారిత్రక విజయానికి గట్టి పునాది వేశాడు. రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ లేని సమయంలో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌లు సైతం మయాంక్ అగర్వాల్ తోడుగా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.