Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
  • 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు
  • పెండ్లికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
  • పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష
  • భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇంగ్లాండ్‌ నిలిచేనా? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

ఇంగ్లాండ్‌ నిలిచేనా?

Sun 09 Jan 02:38:58.537285 2022

- లక్ష్యం 388, ప్రస్తుతం 30/0
- యాషెస్‌ సిరీస్‌ నాల్గో టెస్టు
   యాషెస్‌ సిరీస్‌లో కనీస పోటీ ఇవ్వని ఇంగ్లాండ్‌ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. న్యూ ఇయర్‌ టెస్టులోనూ ఇంగ్లాండ్‌ వైఫల్య గాథ షరా మామూలే అనుకున్న దశలో జానీ బెయిర్‌స్టో వీరోచిత శతకం ఇంగ్లీష్‌ శిబిరంలో కొత్త ఉత్సాహం నింపింది. చివరి రోజు కష్టసాధ్యమైన, భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లాండ్‌ ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియా 388 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇంగ్లాండ్‌ ప్రస్తుతం 30/0తో కొనసాగుతోంది. చివరి రోజు వర్ష సూచనలు సైతం ఉండటంతో సిడ్నీ టెస్టు ఫలితం ఉత్కంఠ కనిపిస్తోంది. ఆస్ట్రేలియా విజయానికి పది వికెట్లు అవసరంగా.. ఇంగ్లాండ్‌ మరో 358 పరుగుల దూరంలో నిలిచింది. చివరి రోజు ఆసీస్‌ పది వికెట్ల ప్రదర్శన పరిపూర్ణం చేస్తుందా? ఇంగ్లాండ్‌ వీరోచిత పోరాటంతో కథను మలుపు తిప్పుతుందా? చూడాలి.
నవతెలంగాణ-సిడ్నీ
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ న్యూ ఇయర్‌ టెస్టు సమరం ఆసక్తికర ముగింపుకు చేరుకుంది!. తొలి మూడు టెస్టుల్లో దారుణ పరాజయం చవిచూసిన ఇంగ్లాండ్‌ జట్టు కొత్త ఏడాదిలో సరికొత్త ఉత్సాహం చూపిస్తోంది. జానీ బెయిర్‌స్టో శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో ప్రతిఘటించిన ఇంగ్లాండ్‌.. ఇప్పుడు ఏకంగా చివరి రోజు ఆస్ట్రేలియాకు సవాల్‌ విసిరే స్థాయికి చేరుకుంది. ఉస్మాన్‌ ఖవాజా మరో శతకంతో చెలరేగటంతో ఇంగ్లాండ్‌కు ఆసీస్‌ 388 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 30/0తో కొనసాగుతోంది. ఓపెనర్లు జాక్‌ క్రావ్లీ (22 బ్యాటింగ్‌, 32 బంతుల్లో 3 ఫోర్లు), హసీబ్‌ హమీద్‌ (8 బ్యాటింగ్‌, 34 బంతుల్లో) అజేయంగా ఆడుతున్నారు. 11 ఓవర్లలోనే 30 పరుగులు సాధించిన ఇంగ్లాండ్‌ ఓపెనర్లు తమ లక్ష్యాన్ని పరోక్షంగా బ్యాట్‌తోనే చెప్పారు. ఆసీస్‌ పేసర్లపై ఎదురుదాడి చేసిన ఇంగ్లాండ్‌ ఓపెనర్లు పరుగుల వేటపైనే ప్రధానంగా దృష్టి సారించారు. చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్‌కు మరో 358 పరుగులు అవసరం. యాషెస్‌ సిరీస్‌లో 4-0 ఆధిక్యానికి ఆతిథ్య ఆస్ట్రేలియా 10 వికెట్ల దూరంలో నిలిచింది. చివరి రోజు వర్షం సూచనల నేపథ్యంలో పూర్తి ఆట సాధ్యపడుతుందనే అంచనాలు స్వల్పంగానే ఉన్నాయి. జో రూట్‌, జానీ బెయిర్‌స్టో, జోశ్‌ బట్లర్‌ జోరుమీదున్నారు. దీంతో చివరి రోజు ఆస్ట్రేలియాకు ఝలక్‌ ఇచ్చేందుకు ఇంగ్లాండ్‌ సిద్ధమవుతోంది.
   నాల్గో రోజు ఆటలో అంతకముందు ఉస్మాన్‌ ఖవాజ (101 నాటౌట్‌, 138 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మేనియా కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకబాదిన ఉస్మాన్‌ ఖవాజ.. యాషెస్‌ టెస్టులో రెండు శతకాలు సాధించిన ఆసీస్‌ బ్యాటర్ల జాబితాలో చేరిపోయాడు. టాప్‌ ఆర్డర్‌లో మార్కస్‌ హారిశ్‌ (27), డెవిడ్‌ వార్నర్‌ (3), మార్నస్‌ లబుషేన్‌ (29), స్టీవ్‌ స్మిత్‌ (23) విఫలమైనా.. ఉస్మాన్‌ ఖవాజ, కామెరూన్‌ గ్రీన్‌ (74, 122 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) జోడీ ఆస్ట్రేలియాకు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు అందించారు. 68.5 ఓవర్లలో 265/6 వద్ద ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ప్రకటించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ (4/84) నాలుగు వికెట్ల ప్రదర్శన చేయగా.. మార్క్‌ వుడ్‌ (2/65) రాణించాడు.
ఖవాజ అవుట్‌ : స్కాట్‌ బొలాండ్‌, ఉస్మాన్‌ ఖవాజ... బాక్సింగ్‌ డే టెస్టులో నమ్మశక్యం కాని స్పెల్‌లో ఇంగ్లాండ్‌ను పతనాన్ని శాసించిన పేసర్‌ స్కాట్‌ బొలాండ్‌. సిడ్నీ టెస్టులో రెండు సెంచరీలు నమోదు చేసిన దిగ్గజాల క్లబ్‌లో చేరిన బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజ. బ్యాటింగ్‌ విభాగంలో ఉస్మాన్‌ ఖవాజ, బౌలింగ్‌ విభాగంలో స్కాట్‌ బొలాండ్‌ ఇద్దరూ చివరి టెస్టుకు దూరం కానున్నారు. ఫిట్‌నెస్‌, కోవిడ్‌-19, మరే ఇతర కారణాలతో ఈ ఇద్దరు చివరి టెస్టులో ఆడటం లేదు అనుకుంటే పొరపాటే. పేసర్‌ జోశ్‌ హజిల్‌వుడ్‌ స్థానంలో స్కాట్‌ బొలాండ్‌ తుది జట్టులోకి రాగా.. కోవిడ్‌-19 బారిన పడిన ట్రావిశ్‌ హెడ్‌ స్థానంలో ఉస్మాన్‌ ఖవాజ జట్టులోకి వచ్చాడు. తొలి అవకాశంలోనే ఈ ఇద్దరూ అద్వితీయ ప్రదర్శన చేశారు. అయినా యాషెస్‌ చివరి టెస్టుకు అటు జోశ్‌ హజిల్‌వుడ్‌, ఇటు ట్రావిశ్‌ హెడ్‌ అందుబాటులోకి రావటంతో ఈ ఇద్దరిపై వేటు వేసేందుకు సెలక్టర్లు సిద్ధమయ్యారు. బొలాండ్‌, ఉస్మాన్‌లు చిరస్మరణీయ ప్రదర్శనలు చేసినా క్రికెట్‌ ఆస్ట్రేలియా సెలక్షన్‌ ప్రక్రియలో భాగంగా ఈ ఇద్దరూ చివరి టెస్టులో హజిల్‌వుడ్‌, ట్రావిశ్‌ హెడ్‌ల కోసం బెంచ్‌కు పరిమితం కాకతప్పటం లేదు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 416/8 డిక్లేర్డ్‌
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 294/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 265/6 డిక్లేర్డ్‌
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : హసీబ్‌ హమీద్‌ నాటౌట్‌ 8, జాక్‌ క్రావ్లీ నాటౌట్‌ 22, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం :(11 ఓవర్లలో) 30.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 4-0-10-0, పాట్‌ కమిన్స్‌ 4-0-15-0, స్కాట్‌ బొలాండ్‌ 3-1-5-0.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్రిసభ్య కమిటీ ఏర్పాటు
నిఖత్‌ జరీన్‌కు ఘన స్వాగతం
కెర్బర్‌ నిష్క్రమణ
బెంగాల్‌కు ఇక ఆడను!
ఫైనల్లో రాజస్థాన్‌
భారత్‌ 16, ఇండోనేషియా 0
రాయల్‌ సమరం
రఫెల్‌ నాదల్‌.. 300
16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.