Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీసా రద్దుపై నేడు కోర్టు విచారణ
మెల్బోర్న్ : ప్రపంచ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేది లేనిది నేడు తేలనుంది. కోవిడ్-19 టీకా తీసుకోని జకోవిచ్ అందుకు టోర్నీ నిర్వాహకులు, విక్టోరియా రాష్ట్రం నుంచి ప్రత్యేక మినహాయిం పులు పొందాడు. కోవిడ్-19 టీకా తీసుకోని జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా సరిహద్దు అధికారులు రద్దు చేశారు. నొవాక్ జకోవిచ్‌ను ప్రభుత్వ నిర్బంధ హౌటల్లో ఉంచారు. వీసా రద్దు నిర్ణయాన్ని జకోవిచ్ న్యాయవాదులు కోర్టులో సవాల్ చేయగా నేడు ఉదయం వాదనలు విననున్నారు. 35 పేజీలతో కూడిన వాదనలను నొవాక్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. జకోవిచ్ వీసా రద్దు నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తే జకోవిచ్ మెల్బోర్న్ వీడి స్వదేశానికి పయనం కావాల్సి ఉంటుంది. జకోవిచ్ వాదనలతో కోర్టు ఏకీభవిస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేం దుకు వరల్డ్ నం.1కు లైన్ క్లియర్ కానుంది. న్యాయస్థానంలో ప్రతికూల నిర్ణయం వెలువడినా తీర్పును సవాల్ చేసేందుకు జకోవిచ్ సిద్ధమైన ఉన్నట్టు తెలుస్తోంది.