Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీసాను పునరుద్ధరించిన న్యాయస్థానం
మెల్‌బోర్న్ : పురుషుల సింగిల్స్ వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మెల్‌బోర్న్‌లో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్‌కు వచ్చిన నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం తొలి ఏస్ సంధించాడు. కోవిడ్-19 టీకా నుంచి ప్రత్యేక మినహాయింపుతో వీసా పొందిన జకోవిచ్‌ను మెల్‌బోర్న్‌లో సరిహద్దు అధికారులు అడ్డగించారు. జకోవిచ్‌ను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అధికారులు అతడి వీసాను రద్దు చేసి నిర్బంధ హౌటల్‌కు తరలించారు. వీసా రద్దు నిర్ణయాన్ని సవాల్ చేసిన జకోవిచ్ ఫెడరల్ న్యాయస్థానంలో విజయం సాధించాడు. నొవాక్ జకోవిచ్ వీసా రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం టెన్నిస్ స్టార్ వీసాను పునరుద్ధరించింది. న్యాయస్థానం తీర్పుతో జనవరి 17 నుంచి ఆరంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జకోవిచ్‌కు మార్గం సుగమం అయ్యింది. న్యాయస్థానం తీర్పుతో నిమిత్తం లేకుండా జకోవిచ్ వీసాను రద్దు చేసే అధికారం ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి ఉంటుంది. ఫెడరల్ మంత్రి విచక్షణాధికారాన్ని జకోవిచ్ న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉండదు.