Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పుకున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌గా దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ వ్యవహరించనుంది. మరో రెండు సీజన్ల పాటు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు వివోకు ఉన్నాయి. భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో 2020 సీజన్‌కు టైటిల్ స్పాన్సర్‌గా తప్పుకున్న వివో.. తిరిగి 2021 సీజన్‌కు టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా పెట్టుబడి వివోకు ఏమాత్రం లాభదాయంగా అనిపించలేదు. దీంతో మరో రెండు సీజన్ల పాటు హక్కులు ఉన్నప్పటికీ భారత దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్‌తో ఒప్పందం చేసుకుని గౌరవంగా తప్పుకుంది. మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పొ సైతం భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా హక్కులు దక్కించుకున్నా.. మార్కెట్‌లో లాభదాయంగా లేదని ఆ హక్కులను ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్‌కు బదలాయించిన సంగతి తెలిసిందే. 2022, 2023 ఐపీఎల్ సీజన్లకు టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లించగా.. టాటా గ్రూప్ ఏడాదికి రూ.335 కోట్లు మాత్రమే చెల్లించనుంది. రెండు కొత్త జట్లతో ఐపీఎల్ మ్యాచుల సంఖ్య పెరుగనుంది. ఈ నేపథ్యంలో బోర్డు అధిక ఆదాయం ఆశించింది. వివో రెండు సీజన్ల హక్కులను రూ.450 కోట్లు చెల్లించి వదులుకుంది. టాటా చెల్లించనున్న ఫీజుతో కలిసి వివో చెల్లించిన ఫీజుతో బీసీసీఐ రూ.1124 కోట్ల ఆదాయం ఆర్జించనుంది. రూ.130 కోట్ల అదనపు ఆదాయం బీసీసీఐ రానున్న రెండు సీజన్ల నుంచి ఆర్జించనుంది.