Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమిండియాకు 13పరుగుల ఆధిక్యత
కేప్‌టౌన్: జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు 210 పరుగులకే కుప్పకూలింది. 159 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన సఫారీ లోయర్ ఆర్డర్ బ్యాటర్స్‌ను భారత పేసర్లు కోలుకోనివ్వలేదు. ఉమేష్ యాదవ్(2/64), షమీ(2/39) కూడా రాణించారు. బుమ్రా కెరీర్‌లో ఐదు వికెట్లు తీయడం ఏడోసారి. దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ పీటర్సన్(72; 166 బంతుల్లో) అర్ధ శతకంతో రాణించగా.. బవుమా(28), కేశవ్ మహరాజ్(25), డస్సెన్(21) ఫర్వాలేదనించారు. మిగతా బ్యాటర్లలో ఎల్గర్ 3, మార్క్రమ్ 8, వెర్రెయన్నె డకౌట్ కాగా.. జాన్సన్ 7 పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా నుంచి అతడొక్కడే..
భారత బౌలింగ్‌ను ఎదుర్కొ,ని దక్షిణాఫ్రికా ఈ మాత్రం స్కోరునైనా సాధించిందంటే దానికి కారణం కీగన్ పీటర్సన్.. ఓ పక్క వికెట్లు పడుతున్నా ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. టెంబా బవుమా, డస్సెన్‌తో కలిసి పీటర్సన్ కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. అయితే టీమిండియా బౌలర్లు వికెట్లు తీస్తూ మ్యాచ్‌పై పట్టు నిలిపారు. షమీ కీలక సమయంలో బవుమాతోపాటు వెరైన్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. వికెట్ల వేటను ప్రారంభించిన బుమ్రా.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు ముగింపు పలకడం విశేషం.
స్కోర్‌బోర్డు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 223ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి)పుజరా (బి)బుమ్రా 3, మార్క్రమ్ (బి)బుమ్రా 8, మహరాజ్ (బి)ఉమేశ్ 25, పీటర్సన్ (సి)పుజరా (బి)బుమ్రా 72, డుస్సెన్ (సి)కోహ్లి (బి)ఉమేశ్ 21, బవుమా (సి)కోహ్లి (బి)షమీ 28, వెర్రెయన్నె (సి)పంత్ (బి)షమీ 0, జెన్సన్ (బి)బుమ్రా 7, రబడా (సి)బుమ్రా (బి)శార్దూల్ 15, ఓలీవర్ (నాటౌట్) 10, ఎన్గిడి (సి)అశ్విన్ (బి)బుమ్రా 3, అదనం 18. (76.3 ఓవర్లలో ఆలౌట్) 210 పరుగులు.
వికెట్ల పతనం: 1/10, 2/17, 3/45, 4/112, 5/159, 6/159, 7/176, 8/179, 9/200, 10/210
బౌలింగ్: బుమ్రా 23.3-8-42-5, ఉమేశ్ 16-3-64-2, షమీ 16-4-39-2, శార్దూల్ 1262-37-1, అశ్విన్ 9-2-15-0.