Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మంచి డిజైన్ పంపండి.. రివార్డు పొందండి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
  • 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు
  • పెండ్లికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
  • పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కెప్టెన్సీ నాకొద్దు! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

కెప్టెన్సీ నాకొద్దు!

Mon 17 Jan 06:10:31.586069 2022

- టెస్టు కెప్టెన్సీ వదులుకున్న విరాట్‌ కోహ్లి
- ట్విట్టర్‌ వేదికగా ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌
నవతెలంగాణ-ముంబయి
దేశీ గడ్డపై టెస్టు విజయాల్లో నిలకడతో పాటు టెస్టు సిరీస్‌ విజయాలను సాధారణ స్థితికి తీసుకొచ్చిన నాయకుడు విరాట్‌ కోహ్లి. భారత్‌కు టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు అందించిన సారథి విరాట్‌ కోహ్లి. మైదానంలో టీమ్‌ ఇండియాను అత్యంత దూకుడుగా ముందుకు నడిపించిన నాయకుడు విరాట్‌ కోహ్లి. టీ20 కెప్టెన్సీ వదులుకున్న కోహ్లికి వన్డే కెప్టెన్సీ వేటుతో బీసీసీఐ షాకివ్వగా.. ఇప్పుడు బీసీసీఐకి విరాట్‌ కోహ్లి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. టెస్టు కెప్టెన్సీకి గుడ్‌ బై చెబుతూ విరాట్‌ కోహ్లి శనివారం సంచలన నిర్ణయం ప్రకటించాడు.
నాయకత్వంలో ఓ తరం ముగి సింది. సౌరవ్‌ గంగూలీని మించి భారత జట్టును నడిపించి ధీరుడు విరాట్‌ కోహ్లి టెస్టు నాయకత్వాన్ని వదిలేశాడు. ఈ మేరకు శనివారం భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు విరాట్‌ కోహ్లి నిర్ణయం వెలువరించాడు. దక్షిణాఫ్రికా చేతిలో 1-2తో టెస్టు సిరీస్‌ ఓడిన అనంతరం విరాట్‌ కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2015లో ఎం.ఎస్‌ ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న విరాట్‌ కోహ్లి ఐదు రోజుల ఆటలో భారత్‌ అత్యంత విజయవం తమైన కెప్టెన్‌గా ఎదిగాడు. భారత్‌కు 68 టెస్టుల్లో నాయకత్వం వహించిన విరాట్‌ కోహ్లి ఏకంగా 40 మ్యాచుల్లో విజయాలు సాధించిపెట్టాడు. 60 టెస్టుల్లో 27 విజయాలతో ధోని, 49 టెస్టుల్లో 21 విజయాలతో గంగూలీ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ' జట్టును సరైన పథంలో నడిపించేందుకు ఏడేండ్లుగా ప్రతి రోజు కఠోర శ్రమ, మథనం చేశాను. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంతో నిజాయితీగా నా బాధ్యత నిర్వర్తించాను. నాయకత్వ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎదురైనా.. ఎన్నడూ విశ్వాసం లేకుండా, ఆత్మవిశ్వాసం లేకుండా బరిలోకి దిగింది లేదు. ప్రతి సారి 120 శాతం ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేశాను. నా నిర్ణయంపై నా మనసులో వంద శాతం స్పష్టత ఉంది. నా జట్టుతో నేను అవిశ్వాసంగా ఉండలేను. ఇంతకాలం భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం కల్పించిన బీసీసీఐకి ధన్యవాదాలు. నా కెప్టెన్నీ ప్రయాణాన్ని మధురమయం చేసిన రవిశాస్త్రికి, సహాయక సిబ్బందికి, నాలోని నాయకుడిని నమ్మిన ఎం.ఎస్‌ ధోనికి కృతజ్ఞతలు' అని విరాట్‌ కోహ్లి ట్వీట్‌ చేశాడు.
వివాదంలోనే..! : విరాట్‌ కోహ్లి, బీసీసీఐ సంబంధాలు కొత్త ఏడాదిలో మరింత క్షీణించాయి. పాలకుల కమిటీ (సీఓఏ) ఆధ్వర్యంలో భారత క్రికెట్‌లో మకుటం లేని మహరాజుగా హవా నడిపించిన విరాట్‌ కోహ్లికి బోర్డు ఆఫీస్‌ బేరర్ల రాకతో సెగ తగలటం మొద లైంది. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేయగా బీసీసీఐ స్వాగతించిదని కోహ్లి పేర్కొనగా.. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని కోహ్లికి చెప్పామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నాడు. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ చేతన్‌ శర్మ సైతం గంగూలీ వ్యాఖ్యలను సమర్థించాడు. ఈ విషయంలో బోర్డు, విరాట్‌ కోహ్లి స్పష్టంగా విడిపోయారు. వన్డే జట్టు ఎంపికకు గంటన్నర ముందు మాత్రమే కెప్టెన్సీ మార్పుపై సెలక్షన్‌ కమిటీ సమాచారం ఇచ్చిందని విరాట్‌ కోహ్లి బోర్డుకు కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. బోర్డుతో వివాదం సాగుతున్న నేపథ్యంలో విరాట్‌ కోహ్లి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై పలకటం గమనార్హం.
ఉత్తమ సారథి! : భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి అత్యంత విజయవంతమయ్యాడు. విరాట్‌ కోహ్లి రాక ముందు విదేశీ గడ్డపై టెస్టు మ్యాచ్‌ విజయాలనే భారత అభిమానులు చారిత్రక మైలురాళ్లుగా భావించేవారు. సౌరవ్‌ గంగూలీ, ఎం.ఎస్‌ ధోనీలు విదేశాల్లో టెస్టు విజయాలకు బాటలు వేసినా.. విరాట్‌ కోహ్లి విదేశీ గడ్డపై టెస్టు సిరీస్‌ విజయాలను సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌ సాధించిన 40 విజయాల్లో ఏకంగా 16 విదేశీ గడ్డపై సాధించినవే. ధోనీ నుంచి నాయకత్వ పగ్గాలు అందుకున్న తొలి నాళ్లలోనే శ్రీలంకలో 2-1తో టెస్టు సిరీస్‌ సాధించాడు. 22 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోహ్లి ఈ విజయం అందుకున్నాడు. వెస్టిండీస్‌ (2-0), శ్రీలంకపై (3-0) క్లీన్‌స్వీప్‌ విజయాలు.. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్‌ విజయం విరాట్‌ కోహ్లి నాయకత్వంలో అతిపెద్ద ఘనతలు. టెస్టు నాయకుడిగా విరాట్‌ కోహ్లి వివాదాలకు సైతం సుపరిచితుడు. చీఫ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లేతో విభేదాలు, డిఆర్‌ఎస్‌ ప్రోటోకాల్‌పై స్టీవ్‌ స్మిత్‌తో వివాదం, ఇటీవల బోర్డుతో వివాదం, తాజాగా సఫారీ పర్యటనలో ప్రసారదారుతో వాగ్వాదం విరాట్‌ కోహ్లిని నిత్యం ఎదో ఒక అంశంలో వివాదంలో నిలిపింది.
వారుసుడు ఎవరు?!
విరాట్‌ కోహ్లి టెస్టు కెప్టెన్సీ వదిలేసి భారత క్రికెట్‌ బోర్డును నిజమైన ఇరకాటంలో పడేశాడు. విరాట్‌ కోహ్లి వారసుడిని టీ20, వన్డే ఫార్మాట్‌లో అన్వేషించటం బీసీసీఐకి పెద్ద పని కాదు. ఆ ఫార్మాట్‌లో కోహ్లి సమవుజ్జీ స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ రూపంలో బోర్డుకు మెరుగైన నాయకుడు అందుబాటులో ఉన్నాడు. టెస్టు ఫార్మాట్‌లో నాయకత్వ మార్పిడిపై ఆలోచన చేసిన బీసీసీఐ.. నిజానికి విరాట్‌ కోహ్లినే సారథిగా కొనసాగించాలని భావించింది. టెస్టు కెప్టెన్‌గా తిరుగులేని రికార్డు కలిగిన అజింక్య రహానెను ఇటీవల వైస్‌ కెప్టెన్‌గా తొలగించిన సెలక్షన్‌ కమిటీ.. ఇప్పుడు పూర్తిగా నయా నాయకత్వంపై దృష్టి సారించాల్సి ఉంది. రోహిత్‌ శర్మ రూపంలో నాయ కుడు అందుబాటులో ఉన్నప్పటికీ మూడు ఫార్మాట్లలో నాయకత్వ భారం అతడి బ్యాటింగ్‌ ప్రదర్శనపై పడుతుందనే ఆందోళన కనిపిస్తోంది. కెఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వాండరర్స్‌ టెస్టులో కెఎల్‌ రాహుల్‌ నాయకత్వం వహించి మెప్పించాడు. రిషబ్‌ పంత్‌కు ఐపీఎల్‌ కెప్టెన్సీ అనుభవం ఉన్నప్పటికీ భారత సీనియర్‌ జట్టుకు ఏ స్థాయిలోనూ నాయకత్వం వహించలేదు. భారత్‌ తదుపరి టెస్టు సిరీస్‌ను స్వదేశంలో ఫిబ్రవరిలో ఆడనుంది. ఆ సిరీస్‌కు ముందు టెస్టు జట్టు కెప్టెన్‌పై సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్రిసభ్య కమిటీ ఏర్పాటు
నిఖత్‌ జరీన్‌కు ఘన స్వాగతం
కెర్బర్‌ నిష్క్రమణ
బెంగాల్‌కు ఇక ఆడను!
ఫైనల్లో రాజస్థాన్‌
భారత్‌ 16, ఇండోనేషియా 0
రాయల్‌ సమరం
రఫెల్‌ నాదల్‌.. 300
16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.